తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు దంచికొడుతున్నాయి. హైదరాబాద్ నగరంలో నిన్న రాత్రి కురిసిన వర్షం నగర వాసులను వణికించింది. ఆకాశానికి చిల్లుపడిందా అన్నట్లుగా కుండపోత వర్షం పడింది. భారీగా కురిసిన వానతో రోడ్లు కాలువలను తలపించాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమై చెరువులను తలపించాయి. ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. నగరంలోని నాలాలు పొంగిపొర్లాయి. నాలాల్లో పడి పలువురు కొట్టుకుపోయారు. ఆసిఫ్ నగర్ అఫ్జల్ సాగర్ మంగారు బస్తిలో విషాదం చోటుచేసుకుంది. నిన్న రాత్రి కురిసిన భారీ వర్షానికి…
నగరంలో వరద సమస్యలు మరింత తీవ్రరూపం దాల్చుతున్న నేపథ్యంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ శుక్రవారం అమీర్‌పేట్, మైత్రి వనం పరిసర ప్రాంతాలను పర్యటించారు. మైత్రి వనం వద్ద వరద ఉధృతి తగ్గించేందుకు చేపట్టవలసిన చర్యలపై ఆయన ఆధ్వర్యంలోనే పరిశీలనలు జరిపారు.
CM Revanth Reddy : హైదరాబాద్‌లో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదివారం ఆకస్మికంగా ముంపు ప్రాంతాలను పర్యటించారు. మైత్రివనం, బల్కంపేట్, అమీర్‌పేట్ ప్రాంతాలను సందర్శించి అక్కడి పరిస్థితులను ప్రత్యక్షంగా పరిశీలించారు. ముఖ్యంగా అమీర్‌పేట్‌లోని గంగుబాయి బస్తీ, బల్కంపేట్‌లోని ముంపు ప్రభావిత కాలనీల్లో ప్రజల పరిస్థితి, నష్టాలను పరిశీలించారు. ముంపు కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలతో సీఎం మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. హైడ్రా కమిషనర్ మరియు సంబంధిత అధికారులను వెంటబెట్టుకొని పర్యటించిన…
GHMC: హైదరాబాద్ నగరంలో హుస్సేన్ సాగర్ సరస్సు దగ్గర నీటి స్థాయిలు క్రమంగా పెరిగిపోతున్నాయి. దీంతో సమీపంలోని కాలనీలకు వరద నీరు చేరే ప్రమాదం ఉంది. ప్రస్తుతం కవాడిగూడ, గాంధీనగర్, అరవింద్‌నగర్, సబర్మతినగర్ వంటి ప్రాంతాల్లో నివసించే ప్రజలను అప్రమత్తం చేసిన అధికారులు, వరద ఉధృతి పెరిగే అవకాశాన్ని బట్టి ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రస్తుతం, వరద నీటి నిల్వ స్థాయి పెరుగుతున్న కారణంగా, ఈ ప్రాంతాల్లోకి నీరు చేరే అవకాశం ఉంది. హాట్ లుక్స్…
Hyderabad Rains : హైదరాబాద్‌లో శుక్రవారం కురిసిన భారీ వర్షం కారణంగా నగరంలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. ముఖ్యంగా ‘పైగా’ కాలనీ, విమాన నగర్ ప్రాంతాల్లో వరద బీభత్సం చోటుచేసుకుంది. భారీ వర్షం కారణంగా హోండా షోరూమ్‌లోకి పెద్ద ఎత్తున వరదనీరు చేరడంతో సిబ్బంది చిక్కుకున్నారు. షోరూమ్‌లో పనిచేస్తున్న సుమారు 80 మంది కార్మికులు వరదలో ఇరుక్కుపోయి సహాయం కోరారు. వెంటనే షోరూమ్ సిబ్బంది పోలీసులకు, డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (DRF), హైడ్రా అధికారులకు సమాచారం అందించారు.…
శని, ఆదివారాల్లో కురుస్తున్న వర్షాలకు సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో జనజీవనం అస్తవ్యస్తమైంది. వరద నీటితో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. మెదక్, సంగారెడ్డి జిల్లాల కంటే సిద్దిపేట జిల్లాలో ఎక్కువ వర్షం కురిసింది. ఆదివారం ఉదయం 8.30 నుంచి సాయంత్రం 6 గంటల మధ్య సిద్దిపేటలోని మిరుదొడ్డి మండలంలో 152.3 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. ఈ కాలంలో సిద్దిపేటలోని 12 మండలాల్లో 100 మి.మీ కంటే ఎక్కువ వర్షపాతం నమోదు కాగా, మెదక్‌లోని రెండు మండలాల్లో 100…
వాతావరణ శాఖ గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా రెడ్ అలార్ట్ ప్రకటించిన నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా అన్ని వేళల అందుబాటులో ఉండి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని మేయర్ గద్వాల్ విజయ లక్ష్మి అధికారులను ఆదేశించారు. భారీ వర్షాల నేపథ్యంలో జోనల్ కమిషనర్లు, చీఫ్ సిటీ ప్లానర్ తో ఆదివారం జిహెచ్ఎంసి మేయర్ గద్వాల్ విజయలక్ష్మి టెలికాన్ఫరెన్స్ నిర్వహించి దిశా నిర్దేశం చేశారు. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో చెరువులు సర్ ప్లస్ అవుతున్న నేపథ్యంలో లోతట్టు…
Musi River: హుస్సేన్ సాగర్ కు వరద పోటెత్తుతుంతి. బంజారా, పికెట్, కూకట్ పల్లి నాలాల నుంచి హుస్సేన్ సాగర్ లోకి వరద వచ్చి చేరుతుంది. హుస్సేన్ సాగర్ లో నీటి మట్టం ఫుల్ ట్యాంక్ లెవెల్ దాటింది.