‘ఐబొమ్మ’ వంటి పైరసీ సినిమా వెబ్‌సైట్లపై ఇటీవల పోలీసు చర్యలు వేగవంతమయ్యాయి. వాటిలో భాగంగా, సైట్ నిర్వాహకుడు ఇమ్మడి రవిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన జ్యుడిషియల్ రిమాండ్‌లో చంచల్‌గూడ జైలులో ఉన్నారు. దర్యాప్తు అధికారులు రవిని కస్టడీలోకి తీసుకుని ఐదు రోజుల పాటు విచారించేందుకు కోర్టు అనుమతి పొందారు. ఈ పరిణామాలపై వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (RGV) స్పందించారు. పైరసీ పూర్తిగా నిర్మూలం అవుతుందా…