RGV – iBomma Ravi : రాబిన్ హుడ్ రవి – పైరసీని హీరోయిజం చేస్తున్న ట్రెండ్‌పై ఆర్జీవీ కౌంటర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘ఐబొమ్మ’ వంటి పైరసీ సినిమా వెబ్‌సైట్లపై ఇటీవల పోలీసు చర్యలు వేగవంతమయ్యాయి. వాటిలో భాగంగా, సైట్ నిర్వాహకుడు ఇమ్మడి రవిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన జ్యుడిషియల్ రిమాండ్‌లో చంచల్‌గూడ జైలులో ఉన్నారు. దర్యాప్తు అధికారులు రవిని కస్టడీలోకి తీసుకుని ఐదు రోజుల పాటు విచారించేందుకు కోర్టు అనుమతి పొందారు. ఈ పరిణామాలపై వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (RGV) స్పందించారు. పైరసీ పూర్తిగా నిర్మూలం అవుతుందా అనే ప్రశ్నకు ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి.
Also Read : Keerthy Suresh : కొత్త ప్రయాణం మొదలు పెట్టబోతున్న కీర్తి సురేష్ ..
Also Read
- Rahul Gandhi: ‘‘రాహుల్ గాంధీ భయపడ్డారు’’.. అఖిలేష్ హామీతో రాయ్‌బరేలీలో పోటీ..
- US-Iran: ‘‘మా దేశం నుంచి వెళ్లిపోండి’’.. ఇరాన్ దౌత్యవేత్తలకు అమెరికా షాక్.!
- Smit Machchhar: ‘‘ఇజ్రాయెల్, భారత్.. ప్రపంచానికే హీరో’’.. స్మిత్ మచ్చర్‌కు నెతన్యాహు భారీ గౌరవం
- Saudi Arabia: సౌదీ రాజధాని రియాద్‌పై హౌతీల భారీ దాడి..
ఆర్జీవీ ట్వీట్ చేస్తూ ఇలా అన్నారు.. “పైరసీ ఎప్పటికీ ఆగదు. టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందినా, పోలీస్ కంట్రోల్ ఎంత కఠినమైన సినిమా ఫ్రీగా చూడాలని కోరుకునే ప్రేక్షకులు ఉన్నంత కాలం, వారికి లింకులు ఇచ్చే రవి లాంటి వారు ఎప్పటికీ ఉంటారు. కొంతమంది రవిని ‘రాబిన్ హుడ్’ తో పోల్చుతూన్నారు రాబిన్ హుడ్ నిజమైన హీరో కాదు. ధనవంతులను దోచుకుని పేదలకు పంచిన మొదటి టెర్రరిస్ట్ లాంటోడు. ధనవంతుల నేరం ఏంటంటే కష్టపడి డబ్బు సంపాదించడం. దోపిడీని మహిమలు చెబుతూ దొంగను దేవుడిలా చూస్తూ పోవడం ప్రజల అజ్ఞానం’ అని తెలిపారు.
అలాగే సినిమా టికెట్ రేట్లు, పాప్‌కార్న్ ధరలు ఎక్కువగా ఉన్నాయనే కోణంలో పైరసీని సమర్థించడం అత్యంత ప్రమాదం అని ఆయన అభిప్రాయపడ్డారు. “BMW కారు ఖరీదు గా ఉందా? కాబట్టి షోరూమ్ దోచేయాలా? బంగారం ఖరీదు గా ఉందా? జ్యువెల్లరీ షాప్ దోచుకుని అందరికీ పంచాలా? ఇదంతా అసంబద్ధం కదా. అయితే సినిమాకి మాత్రం ఆ లాజిక్ ఎందుకు?” అని ప్రశ్నించాడు. పైరసీ చూడడంలో ‘నైతికత’ లేదని, కేవలం సౌకర్యం మరియు ఖర్చు తగ్గడం వల్ల ప్రజలు పైరసీకి అలవాటు పడుతున్నారని ఆయన పేర్కొన్నారు.
‘పైరసీని పూర్తిగా ఆపాలంటే పైరసీని, సరఫరా చేసే వాళ్లతో పాటు చూసే వాళ్లను కూడా నేరస్తులుగా చూడాలి. 100 మంది పైరేటెడ్ సినిమా చూసిన వారిని యాదృచ్ఛికంగా అరెస్ట్ చేసి, వారి పేర్లను పబ్లిక్‌గా ప్రకటిస్తే ఒక్కసారి భయం పుడుతుంది. అప్పుడు అందరికీ అర్థమవుతుంది పైరసీ సినిమా చూడటం అంటే, దొంగ వస్తువులు కొనడమే.” రవి అరెస్ట్‌తో పైరసీ చర్చ మరోసారి ముదిరిన ఈ సమయంలో ఆర్జీవీ చేసిన వ్యాఖ్యలు కొత్త డిబేట్‌కు తావిస్తున్నాయి.
ROBIN HOOD RAVI
Piracy will never stop. Not because technology is too advanced or policing too weak , but because as long as there are a large number of people to watch a pirated film there will always be Ravis to serve them.
Now the funniest thing is Ravi supporters proudly…
— Ram Gopal Varma (@RGVzoomin) November 22, 2025
తాజావార్తలు
-
Prahaar : సాలిడ్ సక్సెస్ కోసం యంగ్ హీరోపై చాలా నమ్మకం పెట్టుకున్న నిర్మాణ సంస్థ
-
Legendary Director Singeetham Srinivasa Rao : తెలుగు సినిమా ప్రమోగశాల మూతపడింది..
-
Rahul Gandhi: ‘‘రాహుల్ గాంధీ భయపడ్డారు’’.. అఖిలేష్ హామీతో రాయ్‌బరేలీలో పోటీ..
-
Oben Rorr EVO: 180KM రేంజ్.. 8 ఏళ్ల బ్యాటరీ వారంటీ.. దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ బైక్ ఇదే..!
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!