Home
Hyderabad Cricket Association
Hyderabad Cricket Association News
-
HCA Scam: హెచ్‌సీఏలో అవినీతి తిమింగలాలు.. సీఐడీ 80 పేజీల చార్జిషీట్లో విస్మయం కలిగించే నిజాలు!
HCA Scam: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA)లో సాగిన అవినీతి, దోపిడీల పర్వంపై తెలంగాణ సీఐడీ (CID) ప్రత్యేక దర్యాప్తు బృందం మల్కాజిగిరి కోర్టులో సమర్పించిన 80 పేజీల ప్రాథమిక చార్జిషీట్లో దిగ్భ్రాంతికరమైన వాస్తవాలు వెలుగుచూశాయి. హెచ్‌సీఏ అధ్యక్షుడు ఎ. జగన్మోహన్రావు, కోశాధికారి శ్రీనివాసరావు, సీఈవో సునీల్ కాంతేల కూటమి అసోసియేషన్‌ను అడ్డాగా చేసుకుని ఏకంగా రూ. 92.08 కోట్ల మేర నిధులను కొల్లగొట్టినట్లు సీఐడీ పక్కా ఆధారాలతో కోర్టు ముందుంచింది. క్రికెట్ పరికరాల కొనుగోళ్లు, మ్యాచ్… -
HCA Controversy: మరో వివాదంలో HCA.. కార్యదర్శి జీవన్ రెడ్డి ఎన్నికపై తీవ్ర ఆరోపణలు.. BCCIకి ఫిర్యాదు
HCA Controversy: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) మరోసారి వివాదాల్లో చిక్కుకుంది. ప్రస్తుత హెచ్‌సీఏ కార్యదర్శి జీవన్ రెడ్డి ఎన్నిక చెల్లదంటూ తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ (TCA) తీవ్ర ఆరోపణలు చేసింది. ఈ వ్యవహారంపై భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI), సీఐడీకి అధికారికంగా ఫిర్యాదు చేసినట్లు టీసీఏ కార్యదర్శి గురువా రెడ్డి వెల్లడించారు. జీవన్ రెడ్డి డబుల్ రిజిస్ట్రేషన్ ఉన్న క్లబ్‌ను కొనుగోలు చేసి హెచ్‌సీఏలోకి ప్రవేశించారని గురువా రెడ్డి ఆరోపించారు. రంగారెడ్డి జిల్లాకు చెందిన… -
HCA New President: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కొత్త అధ్యక్షుడి నియామకం.. ఎవరంటే..?
HCA New President: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా గెలాక్సీ క్రికెట్ క్లబ్‌కు చెందిన అమర్నాథ్ నియామకమయ్యారు. గతంలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌కి జరిగిన ఎన్నికల్లో అమర్నాథ్పై కేవలం ఒక ఓటు ఆధిక్యంతో జగన్మోహన్ రావు విజయం సాధించారు. జగన్మోహన్ రావుకి 63 ఓట్లు రాగా.. అమర్నాథ్కి 62 ఓట్లు వచ్చాయి.. దీంతో జగన్మోహన్ రావు HCA ప్రెసిడెంట్ గా బాధ్యతలు చేపట్టారు. శ్రీచక్ర క్రికెట్ క్లబ్‌ను సృష్టించి.. అక్రమ ఓటింగ్‌కి పాల్పడినట్టు వెలుగులోకి రావడంతో జగన్మోహన్… -
Bandi Sanjay: హెచ్‌సీఏ సెలెక్షన్ కమిటీపై బండి సంజయ్ ఆగ్రహం.. త్వరలో యాక్షన్..!
Bandi Sanjay: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA)పై కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. హెచ్‌సీఏలో జరుగుతున్న జూనియర్ సీనియర్ సెలెక్షన్ల పై సీరియస్ అయ్యారు.. గ్రామీణ స్థాయి క్రికెటర్లకు అవకాశం కల్పించకపోవడంపై వివరాలు సేకరించారు. సెలక్షన్ కమిటీలో ఉన్న సభ్యులపైన యాక్షన్ ఉండబోతుందని హెచ్చరించారు.. రాచకొండ కమిషనర్ కి సైతం సమాచారం ఇచ్చినట్లు స్పష్టం చేశారు. సెలక్షన్ కమిటీ సభ్యులు.. హైదరాబాద్‌లో ఉన్న నైపుణ్యం లేని క్రికెటర్లకి అవకాశం… -
HCA: హెచ్‌సీఏ సెలక్షన్ కమిటీపై ఉప్పల్ పీఎస్‌లో కేసు నమోదు!
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) కమిటీ సభ్యులపై కేసు నమోదైంది. సెలక్షన్ కమిటీ చైర్మన్ హబీబ్ అహ్మద్, సందీప్ రాజన్, సందీప్ త్యాగిలు డబ్బులు డిమాండ్ చేశారని ఇద్దరు ప్లేయర్స్ తల్లిదండ్రులు ఉప్పల్ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. అండర్ 19, అండర్ 23 లీగ్‌లలో ఆడించాలంటే డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు పేర్కొన్నారు. డబ్బులు ఇవ్వనందుకు మంచి ప్రదర్శన చేసినా తన కుమాడిని ఆడనివ్వలేదని, సెలక్షన్ కమిటీపై చర్యలు తీసుకోవాలని ఓ ప్లేయర్ తండ్రి డాక్టర్ రామారావు… -
HCA: హెచ్‌సీఏలో మరో వివాదం.. రాచకొండ సీపీకి ఫిర్యాదు!
ఇండియా క్రికెట్లో అన్ని రాష్ట్రాల అసోసియేషన్లు తమ ప్లేయర్ల కోసం లీగ్స్ నడిపిస్తున్నాయి. కొత్త టాలెంట్‌ను బయటికి తీయడంలో ఈ లీగ్స్ ఉపయోగపడుతాయి. కానీ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) మాత్రం అందుకు భిన్నం. ఇక్కడ లీగ్ పక్కన పెడితే కనీసం వివాదం లేకుండా.. ఈ అసోసియేషన్‌ని రన్ చేయలేరు. ఇప్పటికే ఎన్నో వివాదాలతో పరువు పోగొట్టుకున్న హెచ్‌సీఏ.. ఇప్పుడు మరో వివాదంలో నిలించింది. Also Read: Afghanistan Cricket: చరిత్ర సృష్టించిన ఆఫ్గనిస్తాన్.. ప్రపంచంలోనే మొదటి… -
HCA: హెచ్ సీఏ అధ్యక్షుడు జగన్ మోహన్ రావు సస్పెండ్..
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అక్రమాల వ్యవహారంలో సీఐడీ దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగుచూసిన విషయం తెలిసిందే. తాజాగా హెచ్ సీఏలో భారీ కుదుపు చోటుచేసుకుంది. హెచ్ఎసీఏ అపెక్స్ కౌన్సిల్ కీలక నిర్ణయం తీసుకుంది. హెచ్ సీఏ అధ్యక్షుడు జగన్ మోహన్ రావును సస్పెండ్ చేసినట్లు తెలిపింది. కార్యదర్శి దేవరాజ్, ఖజాంచి శ్రీనివాస్ రావు పదవి నుంచి తొలగించినట్లు పేర్కొంది. 28 జూలై 2025న జరిగిన అత్యవసర సమావేశంలో ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నట్లు వివరించింది. Also Read:Actress Kalpika:… -
HCA Scam: కోట్లు కొల్లగొట్టడంలో ఆరితేరారు… హెచ్‌సీఏ జనరల్ సెక్రెటరీ దేవరాజ్ అరెస్ట్
కోట్లు కొల్లగొట్టడంలో ఆరితేరారు… లేనిది ఉన్నట్లు… ఉన్నది లేనట్టు మాయామశ్చింద్రా చేయడంలో ఘనులు. ఇలాంటోళ్లకు తప్పించుకుని పారిపోవడం ఓ లెక్కా. హెచ్‌సీఏ స్కాంలో సీఐడీకి చిక్కకుండా పారిపోయిన దేవరాజు చుక్కలు చూపించాడు. రోజుకో రాష్ట్రంలో పూటకో ఊరిలో తలదాచుకుంటూ… మారు వేషాల్లో తిరిగాడు. ముప్పుతిప్పలు పెట్టి.. చివరకు పూణెలో అడ్డంగా దొరికిపోయాడు. దేవరాజును కోర్టులో ప్రొడ్యూస్ చేసి రిమాండ్‌కు తరలించారు పోలీసులు. Also Read:Off The Record: రామ్మోహన్ నాయుడు మాటలన్నీ పైపై డబులేనా..? హెచ్‌సీఏ సెక్రెటరీ… -
HCA: హెచ్ సీఏ అక్రమాల పుట్ట.. సీఐడీ దర్యాప్తులో మరో భారీ స్కాం వెలుగులోకి
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అక్రమాల పుట్ట కదులుతోంది.. సీఐడీ దర్యాప్తులో మరో భారీ స్కాం వెలుగుచూసింది. సమ్మర్ క్యాంప్‌ల పేరుతో కోట్ల రూపాయలు కొల్లగొట్టారు హెచ్‌సీఏ కేటుగాళ్లు. తప్పుడు లెక్కలు చూపించి కేవలం ఒక్క నెల రోజుల్లోనే ఏకంగా 4 కోట్ల రూపాయలు కాజేశారు జగన్మోహన్రావు అండ్ కో. ఆటగాళ్లు శిక్షణ ఇవ్వకుండానే ఇచ్చినట్టు.. ఓ బ్యాటు.. ఓ బాల్ మాత్రమే ఇచ్చి.. కిట్ మొత్తం ఇచ్చినట్టు సృష్టించారు. సీఐడీ దర్యాప్తు లో HCA డొంక కదిలి…… -
Devaraj Arrested: హెచ్‌సీఏ జనరల్ సెక్రెటరీ దేవరాజ్ అరెస్ట్..
Devaraj Arrested: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) అవకతవకల కేసులో మరో కీలక పరిణామం వెలుగులోకి వచ్చింది. హెచ్‌సీఏ జనరల్ సెక్రెటరీ దేవరాజ్‌ను ఈరోజు (జూలై25) సాయంత్రం సీఐడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
తాజావార్తలు
-
Jio Voice Only Plans: జియో యూజర్లకు గుడ్ న్యూస్.. రూ.147 నుంచే వాయిస్ ఓన్లీ ప్లాన్స్! వ్యాలిడిటీ వివరాలివే!
-
Bank Holidays November 2026: నవంబర్‌లో భారీగా బ్యాంకు సెలవులు.. పూర్తి లిస్ట్ ఇదే, ముందే తెలుసుకోండి!
-
Raptadu School Attack: “కన్నీళ్లు ఆగడం లేదు”.. రాప్తాడు ఘటనపై సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ సీరియస్
-
Punjab elections: ఆప్ తొలి జాబితా విడుదల.. ధురి నుంచి సీఎం పోటీ, జైలులో ఉన్న ఎమ్మెల్యేకు టికెట్.
-
Mule Accounts : సైబర్ నేరగాళ్లకు ‘మ్యూల్’ ఖాతాల విక్రయం… అంతర్రాష్ట్ర ముఠా గుట్టురట్టు, ముగ్గురు అరెస్ట్!
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!