HCA Corruption Allegations: HCA..! హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌గా కంటే.. హైదరాబాద్ మోస్ట్ కరప్టెడ్ అసోసియేషన్‌గానే పేరు గడించింది. ఒకప్పుడు అంతర్జాతీయ క్రికెట్‌కు కేంద్రంగా ఉన్న అసోసియేషన్.. ఇప్పుడు అవినీతి ఆరోపణలు, అంతర్గత కుమ్ములాటలు, కేసులు, అరెస్ట్‌లకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. హెచ్‌సీఏ ప్రెసిడెంట్‌గా ఉన్న జగన్మోహన్‌రావుతో సహా సెక్రెటరీ దేవరాజ్, ట్రెజరర్ శ్రీనివాసరావు అరెస్ట్ అయ్యారు. పలు కేసుల్లో కేసుల్లో జైలు శిక్ష అనుభవించి ప్రస్తుతం బెయిల్‌పై బయటకు వచ్చారు. దేశవ్యాప్తంగా హెచ్‌సీఏ పరువు బజారునపడింది.…
HCA Corruption: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) ఉపాధ్యక్షుడు దల్జీత్ సింగ్, జాయింట్ సెక్రటరీ బసవరాజుపై సీఐడీకి ఫిర్యాదు అందింది. మల్టిపుల్ క్లబ్ ఓనర్‌షిప్ ప్రయోజనాలతో హెచ్‌సీఏ ఎన్నికల్లో గెలిచారని అంబుడ్స్‌మన్, సీఐడీకి హెచ్‌సీఏ మాజీ కోశాధికారి చిట్టి శ్రీధర్ ఫిర్యాదు చేశారు.