ఎంతో ఉత్కంఠగా ఎదురుచూసిన హుజురాబాద్ ఉప ఎన్నిక పోలింగ్ విజయవంతంగా ముగిసింది. అయితే కొన్నిచోట్ల స్వల్ప వాగ్వాదాలు చోటు చేసుకున్నప్పటికీ మినహా పోలింగ్ ప్రక్రియ హుజురాబాద్ నియోకవర్గంలో ప్రశాంతంగా ముగిసింది. ఈ నేపథ్యంలో ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు మాట్లాడుతూ.. హజురాబాద్ ఓటర్లు చైతన్యం చాటారని ప్రశంసించారు. కేసీఆర్ మార్గదర్శకత్వం, హుజురాబాద్ ప్రజల ఆశీస్సులతో గొప్ప విజయం సాధించబోతున్నామని అభిప్రాయం వ్యక్తం చేశారు. అంతేకాకుండా ఉప ఎన్నిక ఓటింగ్ లో పాల్గొన్న ఓటర్లకు ధన్యవాదాలు తెలిపిన…
రాష్ట్ర వ్యాప్తంగా ఎప్పుడెప్పుడా అని ఉత్కంఠతతో ఎదురుచూసిన హుజురాబాద్ ఉప ఎన్నిక పోలింగ్ ముగిసింది. కోవిడ్ పేషెంట్ల, లక్షణాలు ఉన్న వ్యక్తులకు ఎన్నికల అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేసి ఓటు వేసే అవకాశం కల్పించారు. పోలింగ్ సమయం ముగిసే వరకు పోలింగ్ కేంద్రాల్లో క్యూ లైన్లలో ఉన్న వారికి ఓటు వేసేందుకు మాత్రమే అవకాశం ఉంది. అయితే చాలా పోలింగ్ కేంద్రాల్లో ఇప్పటికే పోలింగ్ ముగిసింది. అంతేకాకుండా ఈవీయంలకు ఎన్నికల సిబ్బంది సీల్ వేస్తున్నారు. అక్కడక్కడా చిన్నచిన్న…
హుజురాబాద్ ఉప ఎన్నిక పోలింగ్ నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హజురాబాద్ ఉపఎన్నిక ఓటింగ్ లో పాల్గొన్న ఓటర్లకు ధన్యవాదాలు.పార్టీ శ్రేణుల నుండి అందిన సమాచారం ప్రకారం బీజేపీ భారీ మెజారిటీతో గెలవబోతోంది. బీజేపీ గెలుపు కోసం పార్టీ నేతలు, కార్యకర్తలు ఎంతో కష్టపడ్డారు. వారందరికీ నా ధన్యవాదాలు. పెద్ద ఎత్తున ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు సహకరించిన పార్టీ కార్యకర్తలు, అధికారులు, సిబ్బందికి అభినందనలు తెలిపారు. అంతేకాకుండా…
హుజురాబాద్ ఉప ఎన్నికకు పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోందని చీఫ్ ఎలక్ట్రోరల్ ఆఫీసర్ శశాంక్ గోయల్ అన్నారు. హుజురాబాద్ ఉప ఎన్నికలకు 306 పోలింగ్ స్టేషన్‌లను ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఏర్పాటు చేసినట్లు ఆయన వెల్లడించారు. అంతేకాకుండా ఎన్నికల నిబంధనలు ఎవ్వరూ ఉల్లఘించిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇప్పటివరకు 88 ఫిర్యాదులు అందినట్లు ఆయన పేర్కొన్నారు. వీటితో పాటు డబ్బు, మద్యం పంపిణీ ఫిర్యాదులపై క్షేత్రస్థాయిలో విచారణ చేపడుతామని.. నిజాలు తేలితే ఎన్నికల అనంతరం కూడా…