టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ తెలంగాణ భవన్ వేదికగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కి సవాల్ విసిరారు. మంగళవారం ఉదయం తెలంగాణ భవన్ లో జర్నలిస్టులతో కేటీఆర్ చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హుజురాబాద్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ పార్టీ భారీ మెజారిటీతో గెలుస్తుందని ఉద్ఘాటించారు. అంతేకాకుండా బీజేపీ, కాంగ్రెస్ కుమ్మకై హుజురాబాద్ లో రాజకీయం చేస్తున్నాయన్నారు. దమ్ముంటే రేవంత్ రెడ్డి హుజురాబాద్ ఉప ఎన్నికల్లో డిపాజిట్ తెచ్చుకోవాలని…
ఎన్నికలంటే సహజంగానే ప్రచారం హోరెత్తెత్తుంది. ఇంటింటికి తిరిగి ఓటడుగుతారు. హామీల వర్షం కురిపిస్తారు. ఒటర్లను ఆకట్టుకుంటారు. కానీ హుజూరాబాద్ ఉప ఎన్నికలు యుద్దాన్ని తలపిస్తున్నాయి. టీఆర్‌ఎస్, బీజేపీ మధ్య పోరు రసకందామంలో పడింది. అభ్యర్థులే కాదు వారి వారి కుటుంబ సభ్యులు కూడా ప్రచారంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. మరో వైపు నియోజకవర్గంలో మద్యం ఏరులైపారుతోంది. డబ్బులు కూడా గట్టిగానే ముట్టచెపుతున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి. మొత్తం మీద ఎప్పుడో కానీ ఇలాంటి ఎన్నికలను మనం చూడలేం అంటున్నారు…
హుజూరాబాద్ మండల ప్రజాప్రతినిధులు, నేతలు, ఇంచార్జులకు మంత్రి హరీశ్‌రావు దిశానిర్ధేశం చేశారు. తాజాగా అక్కడి నేతలతో హరీశ్‌రావు మాట్లాడుతూ… వెక్కిరించిన పనులే వెలుగునిస్తున్నాయి. ఆసరా పింఛన్లు, కళ్యాణలక్ష్మీ, రైతుబంధు, కాళేశ్వరం తరహాలోనే దళితబంధు అమలుకూడా జరుగుతుంది అన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో సంక్షేమ పథకాల్లేవు. ఉద్యోగాలు ఊడగొట్టడమే ఆ పార్టీకి తెలుసు. 1.32లక్షల ఉద్యోగాలు కల్పించిన పార్టీ టీఆర్‌ఎస్. బీజేపీ దొంగ నాటకాలను ప్రజల్లోకి తీసుకెళ్లండి. హుజూరాబాద్‌లో టీఆర్‌ఎస్ విజయాన్ని ఆపలేరు అని తెలిపారు. భారీ మెజార్టీతో…
ప్రస్తుతం దూరంగా ఉంటూనే అక్కడి వ్యవహారాలను చక్కబెడుతున్నారో మంత్రి. ఆయన అడుగుపెడితే మాత్రం ఆరడుగుల వ్యూహం తప్పదనే టాక్ ఉంది. అందుకే ఉపఎన్నిక జరిగే నియోజకవర్గంలో ఆ మంత్రి ఎంట్రీ ఎప్పుడన్నది రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది. ఆయనెవరో ఈస్టోరీలో చూద్దాం. హుజురాబాద్‌లో వేగంగా పావులు కదుపుతోన్న టీఆర్‌ఎస్ హుజురాబాద్ ఉపఎన్నికపై టిఆర్ఎస్ ప్రత్యేక దృష్టి పెట్టింది. గతంలో ఎన్నో ఉపఎన్నికలను ఎదుర్కొన్న అనుభవం ఉన్న గులాబీపార్టీ.. ఈ ఉపపోరును మాత్రం సీరియస్‌గా తీసుకుంది. సిట్టింగ్ స్థానాన్ని…