తెలంగాణలోని హుస్నాబాద్‌లో బండి సంజయ్ మొదటి విడత పాదయాత్ర పూర్తైన సందర్భంగా భారీ సభను ఏర్పాటు చేశారు. ఈ సభకు కేంద్రమంత్రి స్మృతి ఇరానీ హాజరయ్యారు. ఈ సభలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇది బీజేపీ స్వాగత సభ అని, బీజేపీ అధికారంలోకి వస్తే వైద్యం, విద్య విషయంలో మొదటి సంతకం చేస్తామని అన్నారు. 2023లో బీజేపీ అధికారంలోకి వస్తుందని, అందరికీ ఉచితంగా వైద్యం అందిస్తామని, స్కూళ్లను అభివృద్ధి చేస్తామని…
ఈ రోజు హుస్నాబాద్‌లో బీజేపీ సభను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సభకు కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ, ఎంపీ, తెలంగాణ బీజేపీ అద్యక్షుడు బండి సంజయ్, హుజురాబాద్ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ తదితరులు పాల్గొన్నారు. హుజురాబాద్‌లో కేసీఆర్ రాజ్యాంగం అమలు అవుతుందని, మద్యం ఏరులై పారుతోందని, ఇంత చేసినా తనను ఏమీ చేయలేకపోతున్నారని ఈటల పేర్కొన్నారు. అక్టోబర్ 30 న జరిగే కురుక్షేత్ర యుద్ధంలో ధర్మం గెలుస్తుందని, అన్ని జిల్లాల నుండి ఈటలను గెలిపించాలని…
బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర మొదటి విడత ఇవాళ్టితో ముగియనుంది.. ఈ సందర్భంగా హుస్నాబాద్ లో రోడ్ షో, ముగింపు సభ నిర్వహణకు బీజేపీ శ్రేణులు ఏర్పాట్లు చేస్తున్నాయి.. ఇక, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్రమంత్రి స్మృతీ ఇరానీ రాబోతున్నారు.. మెత్తం 36 రోజుల పాటు 438 కిలో మీటర్లు మేర పాదయాత్ర చేశారు బండి సంజయ్.. ఎనిమిది జిల్లాల్లోని 19 అసెంబ్లీ, 6 పార్లమెంట్ నియోజకవర్గాలను…