ఈరోజు నా హృదయం కృతజ్ఞతతో నిండిపోయింది అని నందమూరి బాలకృష్ణ అన్నారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఆయన స్పందించారు. మీరు చూపిన ప్రేమ, అభిమానం, ఆశీస్సులు నా జీవితానికి మరింత అర్థం ఇచ్చాయి. ప్రత్యేకంగా — నా జన్మదినాన్ని పురస్కరించుకుని రెండు తెలుగు రాష్ట్రాల్లో మొత్తం గ్రామ గ్రామాన, మండల కేంద్రాల్లో ఎంతో ఉత్సాహంగా అన్నదానాలు, రక్తదాన శిబిరాలు వంటి ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించిన ప్రతి నాయకుడికి, కార్యకర్తకి, అభిమానికి హృదయపూర్వక ధన్యవాదాలు…