Huge Rush At Yadadri Temple: తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వరుస సెలవులు రావడంతో పెద్ద సంఖ్యలో భక్తులు శ్రీలక్ష్మీ నరసింహస్వామిని దర్శనానికి భారీగా తరలివస్తున్నారు. దీంతో తెల్లవారుజాము నుంచే ఆలయంలోని క్యూలైన్లు భక్తులతో కిక్కిరిసిపోయాయి. స్వామివారి ప్రత్యేకదర్శనానికి 2 గంటల సమయం పడుతుండగా.. ఉచిత దర్శనానికి దాదాపుగా 4 గంటల సమయం పడుతోంది. శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయంలో అధ్యయనోత్సవ భాగంగా నేడు మూడవ…