పుణే టెస్టులోనూ టీమిండియాకు కష్టాలు తప్పలేదు. తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 156 పరుగులకే కుప్పకూలగా... రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన న్యూజిలాండ్ భారీ ఆధిక్యంపై కన్నేసింది. కాగా.. భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్టులో రెండో రోజు ఆట ముగిసింది. ఆట ముగిసే సమయానికి న్యూజిలాండ్ రెండో ఇన్సింగ్స్‌లో 5 వికెట్లు కోల్పోయి 198 పరుగులు చేసింది. దీంతో.. భారత్‌పై న్యూజిలాండ్ 301 పరుగుల ఆధిక్యం సాధించింది.