తెలుగు రాష్ట్రాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. కృష్ణా పరివాహక ప్రాంతంలో కురుస్తున్న వర్షాల నేపథ్యంలో శ్రీశైలం జలాశయానికి భారీగా వరద కొనసాగుతోంది. శ్రీశైలం జలాశయం 8 గేట్లు 12 అడుగులు, మరో 2 గేట్లు 10 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.
మెదక్ జిల్లాలోని ఏడుపాయల వన దుర్గ మాత ఆలయం వద్ద వరద నీరు ప్రవహిస్తోంది. జల దిగ్బంధంలోకి ఏడు పాయల ఆలయం వెళ్లింది. వరద నీరు అమ్మవారి గర్భగుడిలోకి ప్రవేశించాయి. అమ్మవారి పాదాలను తాకుతూ మంజీరానది ప్రవహిస్తుంది.
జూరాల ప్రాజెక్టుకు భారీగా వరద మొదలయ్యింది. ప్రస్తుతం జూరాలకు 27,400 క్యూసెక్కుల వరద వస్తుంది. ఈ సీజన్ లో ప్రాజెక్టుకు ఇదే అత్యధిక ఇన్ ఫ్లో. అలాగే ఇప్పటివరకు జూన్ మొదటి వారంలో ఈ స్థాయిలో వరద రావడం ఇదే ఫస్ట్ టైం.జూరాల క్యాచ్ మెంట్ ఏరియాలో కురుస్తున్న వర్షాలతో వరద కొనసాగుతుంది. అలాగే కృష్ణా నదిపై ఎగువనున్న ప్రాజెక్టులకు వరద భారీగా వస్తుంది. ఎగువన ఆల్మట్టి డ్యామ్ కు 16,300 క్యూసెక్కులు, నారాయణపూర్ ప్రాజెక్టుకు 8…