మలేషియాలో భారీ విస్ఫోటనం సంభవించింది. పుత్రా హైట్స్‌లో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. రాజధాని కౌలాలంపూర్ సమీపంలోని సెలంగోర్ రాష్ట్రంలోని పుత్రా హైట్స్‌లో మంగళవారం ఉదయం గ్యాస్ పైప్‌లైన్ లోపల నుంచి మంటలు చెలరేగడంతో భారీ పేలుడు సంభవించింది. దీనిపై మరింత సమాచారం రావాల్సి ఉంది.