Ragging : ఖమ్మం జిల్లా పాల్వంచలోని కెఎల్ఆర్ ఫార్మసీ కాలేజీలో ర్యాగింగ్ ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. కాలేజీలో ర్యాగింగ్ వేధింపులకు తాళలేక ఒక విద్యార్థిని కాలేజీని వదిలిపెట్టిన ఘటన వెలుగులోకి వచ్చింది. బాధితురాలు శ్రుతి రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ (హెచ్ఆర్సీ)ను ఆశ్రయించి తన వేదనను తెలియజేశారు. శ్రుతి ఫిర్యాదులో కాలేజీ యాజమాన్యం తమ ఒరిజినల్ సర్టిఫికెట్లను ఇవ్వకుండా వేధింపులకు పాల్పడుతోందని ఆరోపించారు. “మూడు లక్షల రూపాయలు కడితేనే సర్టిఫికెట్లు ఇస్తామని కాలేజీ యాజమాన్యం చెబుతోంది,” అని…