హెచ్‌పీసీఎల్ అగ్నిప్రమాదం పై విచారణ కమిటీ నివేదిక సిద్ధం చేసింది. నేడు ఆ నివేదికను కలెక్టర్ వినయ్ చంద్ కు అందజేసే అవకాశం ఉంది. సీడీయు-3లో పైప్ లైన్ దెబ్బ తినడం వల్లే అగ్నిప్రమాదం జరిగిందని నిర్ధారణ చేసింది. పైప్ లైన్ బయటకు సరిగ్గానే కనిపించినా లోపల దెబ్బతినడాన్ని గుర్తించకపోవడం వల్ల ప్రమాదం జరిగిందని నివేదికలో పేర్కొంది కమిటీ. పైప్ లైన్ బలాన్ని నిర్దారించే హైడ్రో టెస్ట్ ఎప్పుడు నిర్వహించారు, ప్రమాదం తీవ్రత పెరగకుండా ఎటువంటి చర్యలు…
విశాఖపట్నం హెచ్‌పీసీఎల్ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసారు హోంమంత్రి సుచరిత. ప్రమాద సంఘటన గురించి ఉన్నతాధికారులతో ఫోన్ లో మాట్లాడిన హోం మినిస్టర్… సహాయకచర్యలు చేపట్టాలని ఫైర్ పోలీసు అధికారులను ఆదేశించారు. హెచ్‌పీసీఎల్ లోని ఫైర్ ఐదు ఇంజెన్స్ తో పాటు మరో 7 అదనంగా పనిచేస్తున్నట్టు తెలిపారు. హెచ్‌పీసీఎల్ లో పాత టెర్మినల్ లో ప్రమాదం జరిగినట్లు హోంమంత్రి కి వివరించారు అధికారులు. ప్రమాదం సంభవించిన వెంటనే సైరన్ మోగించి ఉద్యోగులను బయటకు పంపించినట్లు తెలిపారు.…