Rajanna Sircilla District: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని భగవంతరావు నగర్‌లో ఉరుములు మెరుపులతో కురిసిన వర్షంతో ఓ ఇంటిపై పిడుగుపాటు చోటుచేసుకుంది. పట్టణంలోని భగవంతు రావునగర్‌లో నివాసముంటున్న చిలుకల దేవయ్య ఇంటిపై అకస్మాత్తుగా పిడుగు పడటంతో ఇంట్లో ఉన్న టెలివిజన్, ఫ్రిజ్, ఫ్యాన్ వంటి ఎలక్ట్రానిక్ వస్తువులు దెబ్బతిన్నాయి. ఇంటి పైభాగంలోని గోడకు పిడుగు తగలడంతో కొంత భాగం కూలిపోయింది. ఈ ఘటనతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.