New Year 2023: ఇండియాలో గతేడాది 46 కంపెనీలు యూనికార్న్ హోదా పొందగా ఈ సంవత్సరం 22 సంస్థలే ఈ స్టేటస్ సాధించాయి. అంటే కొత్త యూనికార్న్‌ల సంఖ్య సగం కన్నా తక్కువకు పడిపోయింది. అయితే.. ఫ్యూచర్ యూనికార్న్‌లు ఈ ఏడాది భారీగానే పెరిగాయి. ఈ విషయాలను రెండు వేర్వేరు సంస్థల నివేదికలు వెల్లడించాయి. మొత్తమ్మీద ప్రపంచవ్యాప్తంగా అమెరికా మరియు చైనా తర్వాత 3వ అతిపెద్ద స్టార్టప్స్ అండ్ యూనికార్న్స్ ఎకోసిస్టమ్‌గా ఇండియా ఎదగటం విశేషం.