ఇది ఒక కోర్టు కేసు కాదు.. ఇది ఒక జ్ఞాపకాన్ని చంపే ప్రయత్నం. 1989 జూన్ 4.. టియానన్‌మెన్ స్క్వేర్‌లో చైనీస్ సైన్యం కాల్పులు జరిపిన రోజు అది! వేలమంది యువకులు నేలకొరిగిన ఆ రాత్రి నుంచి చైనా ఒక పని చేస్తూనే ఉంది. ఆ రక్తపాతాన్ని చరిత్ర నుంచి తుడిచివేసే పనిని బహిరంగంగానే చేస్తోంది. పుస్తకాల నుంచి తొలగించడం, మాటల నుంచి మాయం చేయడం. జ్ఞాపకాలనే నేరంగా మార్చడం చైనాకు అలవాటుగా మారింది. కానీ ఆ…