టాలీవుడ్ సినీ పరిశ్రమలో విప్లవాత్మకమైన మైలురాయిగా నిలిచే చిత్రంగా “హనీ కిడ్స్” రూపొందిస్తున్నట్టు మేకర్స్ వెల్లడించారు. ఈ చిత్రం భారతదేశంలో మొట్టమొదటి పూర్తి స్థాయి 100% VFX ఆధారిత సినిమాగా గుర్తింపు పొందబోతోందని వారు పేర్కొన్నారు. ఈ సినిమాను దర్శకుడు హర్ష.ఎం డైరెక్ట్ చేస్తుండగా ఫాంటసీ-సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో సాగనుందని అంటున్నారు. దర్శకుడిగా కొన్ని సినిమాలు చేసిన తల్లాడ సాయికృష్ణ, అమ్మినేని స్వప్నా చౌదరి, నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ, కిషోర్ దాస్,వినోధ్ నువ్వుల, కృష్ణ, తదితరులు ప్రధాన…