జపాన్ ఆటో కంపెనీలు హోండా, నిస్సాన్ విలీనాన్ని ప్రకటించాయి. రెండు కంపెనీలు సోమవారం అవగాహన ఒప్పందం (ఎంఓయు)పై సంతకాలు చేశాయని నిస్సాన్ సీఈవో తెలిపారు. ఈ విలీనం తర్వాత అమ్మకాల పరంగా ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆటో కంపెనీ ఉనికిలోకి రానుంది. ఆటోమొబైల్ పరిశ్రమ ప్రస్తుతం పెను మార్పుల దశకు చేరుకోవడం చూస్తున్నాం. ఒకవైపు పెట్రోల్, డీజిల్ ఇంధనంపై ఆధారపడటాన్ని తొలగిస్తూనే మరోవైపు చైనా ప్రత్యర్థుల నుంచి తీవ్ర పోటీని ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో ఈ నిర్ణయం…