హోండా కార్స్ ఇండియా బుధవారం కొత్త అమేజ్ 2024ను లాంచ్ చేసింది. మూడో తరానికి చెందిన ఈ అమేజ్ ప్రారంభ ధర రూ.8 లక్షలుగా (ఎక్స్-షోరూమ్) కంపెనీ నిర్ణయించింది. టాప్ వేరియంట్ ధర రూ.10.90 లక్షలుగా (ఎక్స్-షోరూమ్) ఉంది. కొత్త అమేజ్ డిజైన్, ఫీచర్ల పరంగా పలు మార్పులతో వచ్చింది. అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ (ఏడీఏఎస్)ను ఇందులో ఇచ్చారు. మొదటి తరం మోడల్ ఏప్రిల్ 2013లో మార్కెట్‌లోకి రాగా.. రెండవ తరం మే 2018లో వచ్చింది.…