కర్ణాటకలో గురువారం రాత్రి తుంగభద్ర కాలువ దగ్గర ఐదుగురు టూరిస్టులపై ముగ్గురు వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. ముగ్గురు వ్యక్తులను కాలువలో తోసేయగా.. ఇద్దరు మహిళలపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది.
అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున కర్ణాటకలో ఓ దారుణం వెలుగులోకి వచ్చింది. ఇజ్రాయెల్ మహిళా పర్యాటకురాలు, హోమ్ స్టే యజమానిపై ఓ గ్యాంగ్ సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన తీవ్ర కలకలం రేపుతోంది.