రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత, దేశంలోనే అత్యంత సంపన్నుడైన ముఖేష్ అంబానీ తల్లి కోకిలాబెన్ అనారోగ్యానికి గురైనట్లు సమాచారం. ఆమె ఆరోగ్యం క్షీణించినట్లు వార్తలు వస్తున్నాయి. కోకిలాబెన్ ఈ ఉదయం హెచ్ఎన్ రిలయన్స్ ఆసుపత్రిలో చేరినట్లు చెబుతున్నారు. ముఖేష్, అనిల్ అంబానీల తల్లి కోకిలాబెన్‌ను( 91 ఏళ్లు) హెచ్‌ఎన్ రిలయన్స్ ఆసుపత్రిలో చేర్పించినట్లు సమాచారం. మీడియా నివేదికల ప్రకారం, కోకిలాబెన్ ఆరోగ్యం అకస్మాత్తుగా క్షీణించిందని, ఆ తర్వాత ఆమెను అత్యవసర పరిస్థితిలో హెలికాప్టర్ ద్వారా ఆసుపత్రికి తరలించినట్లు తెలుస్తోంది.…