Kishan Reddy: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇవాళ అమెరికాకు బయలుదేరారు. ప్రపంచ పర్యాటకరంగ అభివృద్ధిపై ప్రసంగించేందుకు కిషన్ రెడ్డిని ఐక్యరాజ్యసమితి ప్రపంచ పర్యాటక సంస్థ ఆహ్వానించింది. ఇది కిషన్ రెడ్డికి దక్కిన అరుదైన అవకాశం. రేపు (శుక్రవారం) న్యూయార్క్‌లోని ఐక్యరాజ్యసమితి ‘హైలెవల్ పొలిటికల్ ఫోరమ్’ (HLPF) వేదికగా కిషన్ రెడ్డి ప్రసంగించనున్నారు. HLPF వేదికగా ప్రసంగించనున్న తొలి భారత పర్యాటక శాఖ మంత్రిగా అరుదైన గౌరవం దక్కింది. జీ-20 టూరిజం చైర్ హోదాలో కేంద్రమంత్రి హాజరుకానున్నారు. అమెరికాలోని భారత కాన్సులేట్ కార్యక్రమంలో కిషన్‌రెడ్డి పాల్గొననున్నారు. ఈ కార్యక్రమం అనంతరం అటునుంచే లండన్‌కు బయలుదేరనున్నారు. 19వ తేదీ ఉదయం తిరిగి ఢిల్లీకి చేరుకోనున్నారు.
Read also: Pilot Rohith Reddy: పైలట్ రోహిత్ రెడ్డి మహా యాగంలో అపశ్రుతి.. అగ్నికి ఆహుతైన మండపం
ఢిల్లీలో నిన్న కేంద్ర మంత్రివర్గ సమావేశానికి కిషన్ రెడ్డి హాజరుకాలేదు. గత వారం జరిగిన మంత్రివర్గ సమావేశానికి కూడా ఆయన హాజరుకాలేదు. ఈ సమావేశానికి కిషన్ రెడ్డి దూరంగా ఉన్నారు. ఈ నెల 4వ తేదీన బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి నియమితులయ్యారు. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడిగా ఇప్పటివరకు కొనసాగుతున్న బండి సంజయ్‌ను బీజేపీ జాతీయ కార్యవర్గంలోకి తీసుకున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులైన కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేయనున్నారు. కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరిగే వరకు మంత్రిగా కొనసాగుతానని కిషన్ రెడ్డి వారం రోజుల క్రితం ప్రకటించారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులైన తర్వాత కిషన్ రెడ్డి పార్టీ కార్యక్రమాలపై ఎక్కువ దృష్టి సారించారు. తన శాఖ కార్యక్రమాలపై పెద్దగా దృష్టి పెట్టలేదు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులైన తర్వాత ఈ నెల 8న వరంగల్ లో జరిగిన ప్రధాని మోడీ పర్యటన విజయవంతం కావడంలో కిషన్ రెడ్డి కీలక పాత్ర పోషించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి నియామకం తర్వాత రెండోసారి మంత్రివర్గ సమావేశం జరగనుంది. కిషన్ రెడ్డి వరుసగా రెండు సమావేశాలకు గైర్హాజరయ్యారు. అనారోగ్య కారణాలతో గత సమావేశానికి హాజరు కాలేదని కిషన్ రెడ్డి సమాచారం పంపారు.
Botsa Satyanarayana: పవన్ కళ్యాణ్ కామెంట్స్‌కు బొత్స కౌంటర్