ఆస్కార్ విజేత ఎ. ఆర్. రెహమాన్ స్వరపరచగా సింగర్ అనన్య బిర్లా పాడిన ‘హిందుస్తానీ వే’ గీతం భారత్ తరఫున ఒలింపిక్ క్రీడల కోసం టోక్యో వెళ్ళిన క్రీడాకారుల పెదాలపై విశేషంగా నానుతోంది. అంతేకాదు… ఇండియన్ స్పోర్ట్స్ పర్శనాలిటీస్ పై చిత్రీకరించిన ఈ గీతానికి సోషల్ మీడియాలో విశేష స్పందన లభిస్తోంది. చిత్రం ఏమంటే… దేశభక్తిని, క్రీడాస్ఫూర్తిని మిళితం చేస్తూ సాగే ఈ పాటకు మించిన స్పందన నాలుగు రోజుల క్రితం విడుదలైన రెహ్మాన్ మరో సాంగ్…