శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం నియోజకవర్గం పర్యటనలో భాగంగా నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మొదటి రోజు సమీక్షలు, సమావేశాలతో బిజీబిజీ ఉన్నారు. హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రికి పూర్వ వైభవం తీసుకొస్తా అని హామీ ఇచ్చారు. ప్రభుత్వాసుపత్రి అభివృద్ధిపై గత పాలకులు నిర్లక్ష్యం వహించారని మండిపడ్డారు. ఆస్పత్రిలో డాక్టర్లు, సిబ్బందిని అదనంగా ఏర్పాటు చేసి రోగులకు ఇబ్బందులేకుండా చూస్తా అని, ఆస్పత్రిలో ఉన్న పరికరాలతో పాటు మరిన్ని ఎక్విప్‌మెంట్ ఏర్పాటు చేస్తామని బాలయ్య బాబు చెప్పారు. Also…