హిందూ సంప్రదాయాల ప్రకారం కార్తీక మాసానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ మాసంలో హిందువులు ప్రత్యేక పూజలు చేస్తారు. భక్తి, శ్రద్ధలతో శివ కేశవులిద్దరనీ ఆరాధిస్తుంటారు. అంతే కాకుండా శ్రావణ మాసంలో లాగానే.. కార్తీక మాసంలోనూ ఎలాంటి మాంసాహారాలు ముట్టుకోకుండా నియన నిష్టలు పాటిస్తూ.. దీపాలు వెలిగించడం వల్ల సకల పాపాలు తొలగిపోతాయని నమ్ముతారు. అయితే ఈ మాసంలోనే పరమ పవిత్రమైన ఉసిరి చెట్టుకు కూడా పూజలు చేస్తుంటారు. ఉసిరి చెట్టును సాక్షాత్తు శ్రీ మహా విష్ణువుగా…