Thieves attack Hindu temple in USA: హిందూ ఆలయాలపై విదేశాల్లో దాడులు ఆగడం లేదు. ఇటీవల వారం వ్యవధిలో ఆస్ట్రేలియాలో రెండు దేవాలయాలపై ఖలిస్తానీ మద్దతుదారులు దాడులు చేశారు. అంతకు ముందు బ్రిటన్, కెనడా దేశాల్లో కూడా ఇలాగే హిందూ దేవాలయాలపై దుండగులు దాడులు చేసిన సంఘటనలు చూశాం. తాజాగా అమెరికాలో ఓ హిందూ దేవాలయంపై దొంగలు దాడి చేసి ఆలయంలోని విలువైన వస్తువులను దోపిడి చేశారు.
Melbourne Hindu Temple Attacked By Khalistan Supporters: ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ నగరంలో ఖలిస్తాన్ మద్దతుదారులు హిందూ ఆలయంపై దాడి చేశారు. భారత వ్యతిరేక నినాదాలను గోడలపై రాశారు. ఈ ఘటన స్థానికంగా ఉన్న హిందూ సమాాజంలో ఆందోళన కలిగిస్తోంది. దీనిపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం ఈ ఘటన జరిగింది. మిల్ పార్క్ శివారులోని ఉన్న బీఏపీఎస్ స్వామినారాయణ్ మందిర్ గోడలపై గుర్తు తెలియన వ్యక్తులు ‘‘హిందూస్థాన్ ముర్దాబాద్’’ అంటూ గ్రాఫిటీతో భారత…
పాకిస్తాన్ లో మైనారిటీల అణచివేత కొనసాగుతూనే ఉంది. బలవంతంగా మతమార్పిడి చేయడంతో పాటు, హిందూ అమ్మాయిలను అపహరించుకుని వెళ్లి పెళ్లిళ్లు చేసుకోవడం, అత్యాచారాలకు పాల్పడం వంటి ఘటనలు చూస్తూనే ఉన్నాం. ఇటీవల కాలంలో అక్కడ మైనారిటీ హిందువులకు చెందిన దేవాలయాలను ధ్వంసం చేస్తున్నారు కొంతమంది మతోన్మాదులు. గతేడాది అక్టోబర్ నెలలో కొత్రిలోని సింధు నది ఒడ్డున ఉన్న చారిత్రాత్మక హిందూ ఆలయాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. తాజాగా బుధవారం రోజు పాక్ లో మరో…