తెలుగు తెరపై నటరత్న నందమూరి తారక రామారావుకు ముందు, తరువాత ఎందరు నటులు శివుని పాత్రలో నటించినా, ఆ మూర్తిలాగా పరమశివుని పాత్రలో సరితూగిన వారు లేరు. యన్టీఆర్ తొలిసారి శివుని పాత్రలో నటించిన చిత్రం `దక్షయజ్ఙం`(1962). రామారావుకు తొలినుంచీ గురువులను, పెద్దలను గౌరవించడం అలవాటు. తనకు అనేక చిత్రాలలో తల్లిగా నటించిన కన్నాంబ అన్నా, ఆమె భర్త ప్రముఖ నిర్మాత, దర్శకులు కడారు నాగభూషణం అన్నా యన్టీఆర్ కు ఎంతో గౌరవం! వారిపై ఎంత గౌరవం…