BJP MLA: మహారాష్ట్ర బీజేపీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. హిందూ అమ్మాయిలు జిమ్‌కు వెళ్లవద్దని ఎమ్మెల్యే గోపీచంద్ పడాల్కర్ సలహా ఇచ్చారు. బీడ్‌లో జరిగిన ఓ బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. కాలేజీకి వెళ్లే హిందూ అమ్మాయిలు జిమ్‌కు వెళ్లకూడదని, ఇంట్లో యోగా సాధన చేయాలని సూచించారు. కుట్ర జరుగుతోందని, ఎవరిని నమ్మాలో వారికి తెలియదని ఆయన అన్నారు.
కర్ణాటకలోని మంగళూరు జిల్లాలో ఓ షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. హిందూ యువతులతో తిరుగుతున్నందుకు ముస్లిం యువకులను దారుణంగా కొట్టారు. మంగళూరు జిల్లాలోని సోమేశ్వర్ బీచ్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది.