అరుణ్ విజయ్ నటించిన తమిళ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘తడమ్’ 2019లో విడుదలైంది. అరుణ్ ద్విపాత్రాభినయం చేసిన ఈ మూవీ చక్కని విజయాన్ని అందుకుంది. ఈ సినిమాను ఈ యేడాది తెలుగులో ‘రెడ్’ పేరుతో రీమేక్ చేశారు. రామ్ హీరోగా నటించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా విడుదలైంది. తమిళ, తెలుగు భాషల్లో చక్కని విజయాన్ని అందుకున్న ఈ మూవీని టీ సీరిస్ సంస్థ హిందీలో రీమేక్ చేయబోతోంది. ఆదిత్య రాయ్ కపూర్ హీరోగా నటిస్తున్న ఈ…