Akhanda 2: నటసింహం నందమూరి బాలకృష్ణ నాలుగేళ్లుగా బాక్సాఫీస్ వద్ద హల్చల్ చేస్తూనే ఉన్నారు. ‘ఢాకూ మహారాజ్’, ‘భగవంత్ కేసరి’, ‘వీర సింహా రెడ్డి’, ‘అఖండ’ వంటి వరుస బ్లాక్ బస్టర్లతో ఆయన తన దూకుడు కొనసాగిస్తున్నారు. ఇప్పుడు బాలయ్య, బోయపాటి శ్రీను కలయికలో సూపర్ హిట్ అయిన ‘అఖండ’కి సీక్వెల్‌గా ‘అఖండ 2: శివ తాండవం’ తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి సంబంధించిన తాజా సమాచారం ప్రకారం.. ‘అఖండ 2’ మూవీ షూటింగ్ వేగంగా పూర్తవుతోందని తెలుస్తోంది.…