రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌కు ఉన్న క్రేజ్ వేరు. రేట్ ఎంత ఉన్నా సరే ఖర్చు చేసేందుకు అభిమానులు వెనకాడరు. రాయల్ ఎన్ఫీల్డ్ భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా మోటార్ సైకిళ్ల విక్రయంలో ప్రసిద్ధి చెందిన సంస్థ. అందుకే రాయల్ ఎన్ఫీల్డ్ భారతీయులనే కాకుండా విదేశీయులను, వారి అభిరుచులను దృష్టిలో ఉంచుకుని తన ప్రతి బైక్‌ను డిజైన్ చేసి విడుదల చేస్తుంది.