సిమ్లాలో జరిగిన కార్యక్రమంలో హిమాచల్ ప్రదేశ్ 15వ ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ నాయకుడు సుఖ్వీందర్ సింగ్ సుఖు ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకారోత్సవానికి కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రాతో పాటు పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, పార్టీ రాష్ట్ర శాఖ చీఫ్ ప్రతిభా సింగ్ హాజరయ్యారు.