హిజాబ్ వివాదంపై సుప్రీంకోర్టు ఇచ్చే తుది తీర్పు రాష్ట్రానికే మాత్రం పరిమితం కాదని, దేశం మొత్తానికి వర్తిస్తుందని కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై అన్నారు.
Karnataka government on the Heijab: కర్ణాటక రాష్ట్రంలో చెలరేగిన హిజాబ్ వివాదాన్ని ప్రస్తుతం సుప్రీంకోర్టు విచారిస్తోంది. మంగళవారం జరిగిన విచారణలో కర్ణాటక ప్రభుత్వం తన వాదనలను వినిపించింది. హిజాబ్ అల్లర్ల వెనక పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(పీఎఫ్ఐ) ఉందని కర్ణాటక ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. హిజాబ్ అల్లర్ల వెనక పీఎఫ్ఐ కుట్ర ఉందని తెలిపింది. మత విద్వేషాలను రెచ్చగొట్టి.. హిజాబ్ కు అనుకూలంగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారాన్ని ఈ సంస్థ ప్రారంభించిందని కర్ణాటక…