Economic Survey 2023 Highlights: ఇవాళ పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఎకనమిక్ సర్వే-2023ను ప్రవేశపెట్టారు. ఈ సర్వే మన దేశ ఆర్థిక వ్యవస్థ స్థితిగతులకు అద్దం పట్టింది. వివిధ రంగాల గణాంకాలను సవివరంగా పొందుపరిచింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆయా సెక్టార్ల పనితీరును ప్రతిబింబించింది. కేంద్ర ప్రభుత్వం అమలుచేసిన వివిధ పథకాల గురించి, వాటి వల్ల వచ్చిన ఫలితాల గురించి స్పష్టంగా పేర్కొంది.