పాఠశాల విద్య స్థాయిలో బాలలకు పుస్తకాల భారం తగ్గించి నాణ్యత పెంచేలా నూతన పాఠ్య ప్రణాళిక రూపొందించాలని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. 2025-26 విద్యాసంవత్సరంలో కెజి నుంచి పిజి వరకు పాఠ్య ప్రణాళిక సమూల ప్రక్షాళన జరగాలన్నారు మంత్రి.. ఈ క్రమంలో.. పాఠశాల విద్య, ఇంటర్మీడియట్, ఉన్నత విద్య శాఖాధికారులతో మంత్రి లోకేష్ సుదీర్ఘంగా సమీక్షించారు.
Supreme Court: కాలేజీలు, ఉన్నత విద్యాసంస్థల్లో కుల వివక్ష సున్నితమైన అంశమని సుప్రీంకోర్టు తెలిపింది. దీనిని అరికట్టేందుకు సమర్థవంతమైన యంత్రాంగాన్ని రూపొందించాలని చెప్పుకొచ్చింది.
పేద విద్యార్థుల ఉన్నత విద్య కోసం మోడీ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. పీఎం- విద్యాలక్ష్మీ పథకంతో పాటు పలు అంశాలకు ఆమోదం తెలిపింది. పేద విద్యార్థులు ఉన్నత విద్య కోసం సులభంగా రుణాలు పొందేందుకు విద్యాలక్ష్మీ పథకానికి కేబినేట్ ఆమోదముద్ర వేసింది.
సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. యూనివర్సిటీ లపైన నమ్మకం కల్గించేలా పని చేయాలని, కొంత కాలం గా యూనివర్సిటీ పైన నమ్మకం తగ్గుతోందన్నారు సీఎం రేవంత్. యూనివర్సిటీ ల గౌరవాన్ని పెంచాలని ఆయన కోరారు. యూనివర్సిటీ ల్లో వ్యవస్థ లు దెబ్బతిన్నాయని, వ్యవస్థల పునరుద్ధరణ కు ఏం చేయాలో అధ్యయనం చేయాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి.
ఆంధ్రప్రదేశ్ ఇంజినీరింగ్, వ్యవసాయ, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఏపీ ఈఏపీసెట్ ఫలితాలు విడుదలయ్యాయి. ఈరోజు సాయంత్రం 4 గంటలకు హయ్యర్ ఎడ్యుకేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ జె.శ్యామలరావు ఫలితాలు రిలీజ్ చేశారు.
దేశంలోనే మరో విద్యా విప్లవానికి ఆంధ్రప్రదేశ్ నాంది పలకబోతోంది.. ఈ రోజు జరిగిన వీసీల సమావేశంలో తన విజన్‌ను స్వయంగా ఆవిష్కరించారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. తొలిసారిగా టీచింగ్, లెర్నింగ్‌లో ఎమర్జింగ్ టెక్నాలజీస్‌తో అనుసంధానం చేయనున్నారు.. ఆర్టిఫియల్ ఇంటెలిజెన్స్, వర్చువల్ రియాల్టీ, అగ్‌మాంటెడ్ రియాల్టీ, మషిన్ లెర్నిగ్, ఎల్‌ఎల్‌ఎం, మెటావర్స్‌తో మిళితం చేయడం టార్గెట్‌గా పెట్టుకున్నారు.
యూనివర్శిటీ వైస్‌ఛాన్సలర్లకు కీలక ఆదేశాలు ఇచ్చారు సీఎం జగన్.. విద్యా రంగంలో కీలక మార్పులపై చర్చించారు. బోధన, నైపుణ్యాభివృద్ధిలో ఎమర్జింగ్ టెక్నాలజీస్ అనుసంధానంపై సీఎం కీలకంగా దృష్టి పెట్టారు.
Fund For Orphans: హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి అనాథ పిల్లల ఉన్నత విద్యకు నిధిని ప్రకటించారు. రాష్ట్రంలోని సుమారు 6,000 మంది అనాథ పిల్లలకు నూతన సంవత్సర కానుకగా రూ. 101 కోట్ల నిధిని సీఎం సుఖాశ్రయ సహాయత కోష్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు.