కోటి ఆశలతో విదేశాల్లో విద్యాభ్యాసం కోసం వెళ్లిన తెలంగాణ విద్యార్ధులు ప్రమాదాలకు గురై తిరిగిరాని లోకాలకు చేరారు. దీంతో ఆయా కుటుంబాల్లో విషాదం నెలకొంది. ఈ నెల 7న యూఎస్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో కిరణ్ రెడ్డి మృతి చెందాడు. జర్మనీలో జరిగిన పడవ ప్రమాదంలో అఖిల్ గల్లంతయ్యాడు. ఇద్దరూ ఉన్నత విద్యను అభ్యసించేందుకు విదేశాలకు వెళ్ళారు. అఖిల్ ఆచూకీ కోసం జర్మన్ రాయబార కార్యాలయానికి కేంద్రం లేఖ రాసింది. అమెరికాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో…
డిగ్రీ విద్యార్థులకు ఉన్నత విద్యామండలి ఆయా కోర్సుల్లో చేరిన విద్యార్థులు ఆ కోర్సులు తమకు నచ్చకుంటే వేరే కోర్సుల్లో చేరేందుకు మూడు రోజుల గడువును ఇచ్చింది. తెలంగాణ రాష్ర్టంలో ఇప్పటికే దోస్త్ ద్వారా కాలేజీల్లో చేరిన డిగ్రీ విద్యార్థులు మూడోవిడత కింద కోర్సులను మార్చుకునేందుకు ఇంట్రా కాలేజీ స్లైడింగ్‌కు ఉన్నత విద్యామండలి అవకాశం ఇచ్చింది. Also read: పీహెచ్‌డీలో ప్రవేశాలకు కామన్ ఎంట్రన్స్ టెస్ట్ దీన్లో భాగంగా ఈ నెల15 నుంచి 17 వరకు విద్యార్థులు వెబ్…
తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే అగ్రవర్ణ పేదలకు (ఈడబ్ల్యూఎస్) రిజర్వేషన్లు అమలు చేస్తూ నిర్ణయం తీసుకుంది.. ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు, విద్యాసంస్థల్లో ప్రవేశాల్లో ఈబీసీలకు 10 శాతం రిజర్వేషన్ వర్తిస్తుందని స్పష్టం చేసింది.. రూ. 8 లక్షల్లోపు వార్షిక ఆదాయం ఉన్న వారికి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వర్తిస్తుందని ప్రభుత్వం పేర్కొంది.. ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు వర్తించని వారికి ఇకపై ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వర్తించనుంది.. ఇక, విద్యా సంస్థల్లో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లపై కీలక తీసుకుంది తెలంగాణ ఉన్నత విద్యా…