ఎంపీగా అనర్హత వేటు పడిన నేపథ్యంలో, క్రిమినల్ పరువునష్టం కేసులో హైకోర్టు నుంచి ఉపశమనం పొందకుంటే రాహుల్ గాంధీ ఢిల్లీలోని లుటియన్స్‌లోని తన అధికారిక బంగ్లాను ఒక నెలలోపు ఖాళీ చేయాల్సి ఉంటుందని ఒక అధికారి శుక్రవారం తెలిపారు. 2004లో లోక్‌సభ ఎంపీగా ఎన్నికైన తర్వాత రాహుల్‌గాంధీకి తుగ్లక్ లేన్ బంగ్లాను కేటాయించారు.