ఏపీ ప్రభుత్వం గతంలో జీవో నెంబర్ 2ను ప్రవేశపెట్టింది. పంచాయతీ సర్పంచులు, సెక్రటరీల అధికారాలను వీఆర్వోలకు అప్పగిస్తూ ఈ జీవోను ఏపీ ప్రభుత్వం జారీ చేసింది. అయితే ప్రభుత్వం నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సర్పంచులు ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. జీవో నెంబర్ 2 పంచాయతీ రాజ్ చట్టానికి విరుద్ధమని పిటిషనర్లు పేర్కొన్నారు. దీంతో సర్పంచుల పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు గతంలోనే జీవో నెంబర్ 2ను సస్పెండ్ చేసింది. అయితే దీనిపై మరోసారి హైకోర్టులో విచారణ కొనసాగుతోంది.…
ఇటీవలే ఏపీలో నెల్లూరు కార్పొరేషన్‌తో పాటు 12 నగరపంచాయతీ, గ్రామపంచాయతీల ఎన్నికల జరిగిన విషయం తెలిసింది. అయితే కృష్ణా జిల్లా కొండపల్లి మున్సిపాలిటీలో 29 స్థానాలు ఉండగా 14 స్థానాల్లో వైసీపీ 15 స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు గెలుపొందారు. అయితే 16 సభ్యుల కోరం ఉంటేనే చైర్మన్ ఎన్నిక నిర్వహించనున్న నేపథ్యంలో టీడీపీ ఎంపీ కేశినేని నాని ఎక్స్ అఫిషియో ఓటును వినియోగించుకోనున్నారు. ఈ నేపథ్యంలో కౌన్సిల్ కార్యాలయం వద్దకు నిన్న టీడీపీ, వైసీపీ శ్రేణులు చేరుకున్నారు.…