తెలంగాణ రాష్ట్రంలో అధిక ఛార్జీలు వసూలు చేస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ పై కొరడా ఝులిపించేందుకు రవాణా శాఖ సిద్దమవుతుంది. విజయవాడ, వైజాగ్, బెంగుళూరు రూట్స్ లో ఎక్కువ వసూలు చేస్తున్నట్టు తెలిసింది.. అందుకే స్పెషల్ డ్రైవ్ కూడా చేపట్టామని జాయింట్ ట్రాన్ పోర్ట్ కమిషనర్ రమేష్ అన్నారు. అందులో 79 బస్సుల పైన చర్యలు తీసుకోవడం జరిగిందని తెలిపారు. వీటిల్లో రూ.35 వేల జరిమానా కూడా విధించినట్లు ఆయన పేర్కొన్నారు.