Shocking: దేశ ఆర్థిక రాజధానిగా, ఐటీ హబ్‌గా విలసిల్లుతున్న బెంగళూరులో నిత్యం లక్షలాది మంది ప్రజలు మెట్రోను ఆశ్రయిస్తున్నారు. సురక్షితమైన, సౌకర్యవంతమైన ప్రయాణానికి మెట్రో ఒక ప్రత్యామ్నాయంగా నిలుస్తున్న తరుణంలో, ఇటీవల వెలుగులోకి వచ్చిన ఒక సంఘటన నగర ప్రజలను, ముఖ్యంగా మహిళలను తీవ్ర భయాందోళనలకు గురిచేసింది. అదే, “బెంగళూరు మెట్రో చిక్స్” అనే ఇన్ స్టాగ్రామ్ పేజీ వ్యవహారం. నిత్యం రద్దీగా ఉండే బెంగళూరు మెట్రో బోగీల్లో మహిళలు, అమ్మాయిలు ప్రయాణిస్తున్నప్పుడు వారి ప్రమేయం లేకుండా,…
దేశ రాజధాని ఢిల్లీలో మరో దారుణం వెలుగుచూసింది. ఓ ఇంటి యాజమాని కొడుకు అత్యంత నీచానికి ఒడిగట్టాడు. అద్దె ఇంట్లో ఉంటున్న యువతి దృశ్యాలను స్పై కెమెరా ద్వారా రికార్డ్ చేసి దారుణానికి ఒడిగట్టాడు. పాపం పండి భండారం బయటపడింది. రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడును అరెస్ట్ చేశారు.
గుండ్లవల్లేరు ఘటనలో నూటికి నూరు శాతం హిడెన్ కెమెరాలు అంశం దాగి ఉందని మహిళా కమిషన్ చైర్‌పర్సన్ గజ్జల వెంకటలక్ష్మి సంచలన వ్యాఖ్యలు చేశారు.. కడప నగరంలోని రోడ్లు భవనాల శాఖ అతిథి గృహంలో విలేకరులతో మాట్లాడిన ఆమె.. రెండు షవర్లను చీకట్లో పోలీసులు ఎత్తుకెళ్లడంపై తమకు అనుమానాలు ఉన్నాయన్నారు.. నిరసన వ్యక్తం చేస్తున్న విద్యార్థులను కళాశాల ప్రిన్సిపాల్ బెదిరించడం.. తెల్లారేసరికి పరిస్థితులు మారుతాయి అనడం.. అనుమానాలకు తావిస్తున్నాయని ఆమె పేర్కొన్నారు.
ఓయో రూమ్‌లలో సీక్రెట్ కెమెరాలు పెట్టి జంటల రొమాంటిక్ వీడియోలు తీస్తోంది ఓ ముఠా. అనంతరం వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తామంటూ బెదిరించి భారీ మొత్తంలో డబ్బులు డిమాండ్ చేస్తోంది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో వెలుగులోకి వచ్చింది.