Hassan Nasrallah: హిజ్బుల్లా అధినేత సయ్యద్ హసన్ నస్రల్లా చనిపోయినట్లు ఆ సంస్థ శనివారం ధ్రువీకరించింది. శుక్రవారం లెబనాన్ రాజధాని బీరూట్‌పై జరిగిన దాడిలో నస్రల్లాను హతమార్చామని ఇజ్రాయిల్ ఆర్మీ చెప్పిన కొన్ని గంటల తర్వాత హిజ్బుల్లా నుంచి ఈ ప్రకటన వచ్చింది.