హిజ్బుల్లా చీఫ్ ఇజ్రాయెల్ వైమానిక దాడిలో హత్యకు గురైన తర్వాత ఇరాక్‌లో 100 మందికి పైగా నవజాత శిశువులకు 'నస్రల్లా' అని పేరు పెట్టారు. నస్రల్లా మరణం మధ్యప్రాచ్యంలో ప్రకంపనలు సృష్టించగా, మరోవైపు ఆయన పేరుకు ప్రజాదరణ వేగంగా పెరిగింది. నస్రల్లా ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా పోరాటం, ప్రతిఘటనకు చిహ్నంగా పరిగణించబడ్డాడు. ఇప్పుడు ఆయన మరణానంతరం ఆయన పేరు కొత్త తరానికి స్ఫూర్తిగా నిలుస్తోంది.
Hezbollahs: హిజ్బుల్లా చీఫ్ హసన్ నస్రల్లా మరణించాడు. శుక్రవారం జరిగిన బీరూట్‌పై ఇజ్రాయిల్ భీకరదాడులు చేసింది. హిజ్బుల్లా సెంట్రల్ హెడ్ క్వార్టర్స్ లక్ష్యంగా వైమానికి దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో నస్రల్లా మరణించాడు. ఈ విషయాన్ని ఇజ్రాయిల్ ఆర్మీతో పాటు హిజ్బుల్లా కూడా ప్రకటించింది. అంతకుముందు హిజ్బుల్లా కీలక కమాండర్లు అయిన ఫువాద్ షుక్ర్, ఇబ్రహీం అఖిల్‌లను కూడా ఇజ్రాయిల్ వైమానిక దాడుల్లోనే చంపేసింది.
Hezbollah Unit 910: హెజ్‌బొల్లా చీఫ్ ను మట్టుబెట్టడంతో ఇప్పుడు వారు ప్రతీకారం తీర్చుకుంటుందేమో అని ఇజ్రాయిల్ జాగ్రత్తలు చేసుకుంటోంది. ఇదివరకు ప్రపంచవ్యాప్తంగా ఇజ్రాయిలను లక్ష్యంగా చేసుకొని ఓ యూనిట్ మళ్ళీ రంగంలోకి దిగవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. అదే యూనిట్ 910. దీనిని బ్లాక్ యూనిట్ అని కూడా పిలుస్తారు. అలాగే షాడో యూనిట్ అని కూడా వ్యవహారికంగా పిలుస్తారు. మిలిటెంట్ సంస్థలో ఈ యూనిట్ ఓ కోవర్ట్ విభాగం. ఇదివరకు ఆసియా, ఆఫ్రికా, అమెరికా…
గత రెండు రోజులుగా లెబనాన్‌లో కమ్యూనికేషన్ పరికరాలు పేలుళ్లు హడలెత్తించాయి. ఆ ఘటనలో ఇప్పటి వరకు 37 మంది ప్రాణాలు కోల్పోయారు. 3000 మంది గాయపడ్డారు. ఈ పేలుళ్ల నుంచి ఇంకా తేరుకోకముందే తాజాగా దక్షణి లెబనాన్‌పై బాంబుల వర్షం కురిసింది. దీంతో మరోసారి లెబనాన్ వాసులు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. ఇజ్రాయెల్ ఈ దాడులకు పాల్పడినట్లుగా హిజ్బుల్లా చీఫ్ ప్రకటించారు.