Whatsapp Settings: ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రముఖ యాప్‌లలో WhatsApp ఒకటి. మెటా యాజమాన్యంలోని వాట్సాప్ కంపెనీ వినియోగదారుల భద్రత కోసం నిరంతరం కొత్త అప్‌డేట్‌లను తీసుకువస్తూనే ఉంది.
జనాలని బురిడీ కొట్టించి, డబ్బులు దండుకోవడానికి సైబర్ నేరగాళ్లు పన్నుతున్న వ్యూహాలు అన్నీ ఇన్నీ కావు. రకరకాల యాప్‌ల ద్వారా మోసాలకు పాల్పడుతున్నారు. ముఖ్యంగా.. ఏదైతే ట్రెండింగ్‌లో ఉంటుందే, దాన్నే ఆయుధంగా మలుచుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. ఇప్పుడు వీరి కన్ను ‘వాట్సాప్’పై పడింది. ఈ మెసేజింగ్ యాప్‌ని ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది వినియోగిస్తారన్న సంగతి తెలిసిందే! దీన్నే ఆసరాగా చేసుకొని.. వాట్సాప్‌ని పోలి ఉండే నకిలీ యాప్స్ తయారు చేస్తూ, మోసాలకు తెగిస్తున్నారు. గతంలోనూ ఈ పన్నాగాలు పన్నారు.…