హెటిరో ఫార్మా సంస్థలపై అదాయపు పన్ను శాఖ దాడులు…రెండో రోజు కొనసాగుతున్నాయ్. నిన్న ఉదయం నుంచి హైదరాబాద్, విశాఖపట్నం, గుంటూరు, విజయవాడల్లో ఐటీ సోదాలు జరుగుతున్నాయి. కోవిడ్ సమయంలో కంపెనీ లావాదేవీలు, ఐటీ రిటర్న్స్ పత్రాలను పరిశీలించినట్లు తెలుస్తోంది. సంస్థ డైరెక్టర్లు జొన్నల సంబిరెడ్డి, నరసింహారెడ్డి, బండి వంశీకృష్ణ, బండి పార్థసారథిరెడ్డితో పాటు భాగస్వాముల ఇళ్లలోనూ సోదాలు జరుగుతున్నాయి. సనత్‌నగర్‌లోని హెటిరో హెడ్ ఆఫీస్‌తో పాటు వైజాగ్ నక్కపల్లి మండలంలో ఉన్న హెటిరో కార్యాలయంలోనూ…ఐటీ అధికారులు తనిఖీలు…