నటసమ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు, కళాభినేత్రి వాణిశ్రీ జంటగా నటించిన అనేక చిత్రాలు తెలుగువారిని పులకింప చేశాయి. ఏయన్నార్ హిట్ పెయిర్ గా వాణిశ్రీ జేజేలు అందుకున్నారు. వారిద్దరూ జోడీగా నటించిన ‘ఆలుమగలు’ చిత్రం కూడా తెలుగువారిని విశేషంగా ఆకట్టుకుంది. ఈ సినిమా 1977 మార్చి 17న విడుదలయి, విజయఢంకా మోగించింది. అక్కినేనితో పలు విజయవంతమైన చిత్రాలు నిర్మించిన ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ అధినేత ఎ.వి.సుబ్బారావు ‘ఆలుమగలు’ సినిమాను తాతినేని రామారావు దర్శకత్వంలో తెరకెక్కించారు. ‘ఆలుమగలు’ కథ ఏమిటంటే-…