హీరో కంపెనీకి చెందిన బైకులకు మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంటుంది. స్పోర్టీ లుక్ తో వస్తుండడంతో యూత్ కొనేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. తాజాగా హీరో మోటోకార్ప్, తన పాపులర్ మోటార్ సైకిల్ అయిన ఎక్స్‌ట్రీమ్ 125R కొత్త వేరియంట్‌ను భారత్ లో విడుదల చేసింది. ఈ బైక్ ధర రూ.1.04 లక్షలు (ఎక్స్-షోరూమ్). కొత్త బైక్ అనేక కొత్త ఫీచర్లు, కలర్ ఆప్షన్స్ ను కలిగి ఉంది. అయితే ఇంజిన్ లో ఎలాంటి మార్పు చేయలేదు.…
ఎక్కువ మంది 125cc బైకులనే కొనుగోలు చేస్తుంటారు. బడ్జెట్ ధరల్లో లభిస్తుండడంతో దాదాపు ఈ బైకులకే మార్కెట్ లో డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. మార్కెట్లో 125cc బైక్‌లకు ఉన్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని టూవీలర్ తయారీ కంపెనీలు అదిరిపోయే ఫీచర్లతో బైకులను రూపొందించి మార్కెట్ లోకి రిలీజ్ చేస్తున్నాయి. కాగా బజాజ్ ఆటో ఇటీవల కొత్త పల్సర్ NS125 సింగిల్ ఛానల్ ABS వేరియంట్‌ను విడుదల చేసింది. భారత మార్కెట్లో, ఇది హీరో ఎక్స్‌ట్రీమ్ 125R తో…