Chairman’s Desk: సినిమాకి ఎంతమంది పనిచేసినా.. పేరుకి 24 విభాగాలున్నా.. వారందరికీ ఉపాధి దొరకాలంటే.. నిర్మాతలు సినమాలు తీయాల్సిందే. అంటే అందరూ కచ్చితంగా నిర్మాతను గౌరవించాలి. ఇందులో వింతేముంది అనుకోవచ్చు. కానీ టాలీవుడ్‌లో నిర్మాతల పరిస్థితి నానాటికీ తీసికట్టుగా మారింది. మామూలుగా ఏ రంగంలో అయినా పెట్టుబడిదారులే ఆయా కంపెనీల కార్యకలాపాల్ని నియంత్రిస్తారు. వ్యాపారం ఎలా చేయాలి.. ఎవర్ని ఉద్యోగులుగా తీసుకోవాలి. ఇలా అన్నీ వారిష్టప్రకారమే జరుగుతాయి. కానీ సినిమాల్లో మాత్రం ఎన్ని వందల కోట్లు బడ్జెట్…