అమెరికాలోని అలస్కాలో యూఎస్ మిలిటరీకి చెందిన రెండు హెలికాప్టర్లు కూలిపోయాయి. మిలటరీ శిక్షణలో భాగంగా రెండు ఆర్మీ హెలికాప్టర్లు ఒక్కసారిగా కుప్పకూలిపోయాయి. శిక్షణ విమానాలు తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
అమెరికా ఆర్మీకి చెందిన రెండు బ్లాక్ హాక్ హెలికాప్టర్లు కెంటకీలో ఢీ కొన్న ఘటనలో 9 మంది సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. పోర్ట్ కాంప్ బెల్ కు 30 మైళ్ల దూరంలో బుధవారం రాత్రి 9.30 గంటల సమయంలో ఘటన చోటు చేసుకుంది.
Helicopters Crash: అమెరికాలో ఘోర ప్రమాదం జరిగింది. రెండు బ్లాక్ హాట్ హెలికాప్టర్లు కుప్పకూలాయి. ఈ ఘటనలో 9 మంది అమెరికన్ సైనికులు మరణించారు. బుధవారం రాత్రి సమయంలో ఈ ఘటన జరిగింది. ఆర్మీ శిక్షణలో ఈ ప్రమాదం జరిగినట్లు మిలిటరీ అధికార ప్రతినిధి గురువారం తెలిపారు. కూలిపోయిన హెలికాప్టర్లు 101వ వైమానిక విభాగానికి చెందినవని, తొమ్మిది మంది సైనికులు మరణించారని దీని ప్రతినిధి లెఫ్టినెంట్ కల్నల్ ఆంథోనీ హోఫ్లర్ తెలిపారు.